7,545 ఉద్యోగ నియామకాలు చేపట్టనున్న ఏపీఎస్ ఆర్‌టీసీ! 29 d ago
రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్‌టీసీ లో భారీగా ఉద్యోగాల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ ను విడుదల చేయనుందని , 7 వేల ఉద్యోగాలకు పైగా భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు వెల్లడించారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 18 కేటగిరీలలో 7 వేలకు పైగా పోస్టుల వివరాలకు సంబంధించిన నివేదికను ఏపీఎస్ఆర్‌టీసీ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం 7,545 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీఎస్ఆర్‌టీసీ సిద్ధమవుతోంది. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను చూస్తే, డ్రైవర్ పోస్టులు 3,673, కండక్టర్ పోస్టులు 1,813, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 656, అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ పోస్టులు 579, ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు 207, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 179, డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు 280 వరకు ఉన్నాయి.